Articles

సమ్మోహన శక్తి!


మహారాష్ట్ర, హర్యానా రాషా్టల్ర అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయఢంకా మోగించడం ఖచ్చితంగా మోడీ మ్యాజిక్కే! ఎందుకంటే ఈ రెండు రాషా్టల్ల్రో బిజెపికి నాయకులు లేరు. గ్రామ స్థాయి వరకూ పటిష్ఠమైన పార్టీ నిర్మాణం లేదు. చాలా నియోజకవర్గాల్లో కార్యకర్తలు లేరు. అయినా పార్టీ విజయం సాధించడం మోడీ మాయ కాక మరేమిటి? ఈ రెండు రాషా్టల్ల్రో బిజెపికి వచ్చిన ఓట్లను ఆయా రాషా్టల్ల్రోని ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా కూడా చాలా మంది అంటున్నారు కానీ అంతకు మించిన మోడీ హవాగానే లెక్కించాల్సిన పరిస్థితి ఉంది. లోక్‌సభ ఎన్నికల ప్రభంజనాన్నే మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ బిజెపి కనబరచడాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ సమ్మోహిత శక్తి వల్లే ఈ రెండు రాషా్టల్ల్రోనూ అధికార కాంగ్రెస్‌ పతనమైంది. 288 సీట్లు కలిగిన మహారాష్ట్ర అసెంబ్లీలో 122 సీట్లను బిజెపి కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అలాగే 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో 47 స్థానాలు గెలుచుకున్న బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. 

ఇటీవల జరిగిన పలు రాషా్టల్ర అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో మోడీ మ్యాజిక్‌పై చర్చకు తెరలేచింది. ఆయన ప్రభ క్రమంగా తగ్గిపోతున్నదా అనే అనుమానం ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్తలకే కలి గింది. అయితే ఈ రెండు రాషా్టల్ర అసెంబ్లీ ఎన్నికలతో వారికి మళ్లీ నమ్మకం కలిగినట్లుగా కనిపిస్తున్నది. అందుకే మహారాష్టల్రో ఎన్సీపీతో వెళ్లాలా, శివసేన తో కలవాలా అనేది మోడీ ఇష్టమని ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్తలు ప్రకటించే శారు. మోడీ హవాపై నమ్మకం లేకపోతే వారు ఖచ్చితంగా శివసేనతో కలిసి వెళ్లాల్సిందేనని హుకూం జారీ చేసి ఉండేవారు. ఈ రెండు కీలక రాషా్టల్ర అసెంబ్లీ ఎన్నికలు మోడీ ప్రజాకర్షక శక్తికి అగ్ని పరీక్షలా మారాయి. ఎగ్జిట్‌ పోల్‌‌సలో వెల్లడైనట్టుగానే ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ మాయాజాలం మరింత ప్రస్పుటమైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని మోడీ కనబరిచారో అదే రీతిలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ బిజెపికి ఓట్ల పంట పండించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలో కేవలం నాలుగు సీట్లు మాత్రమే గెలు చుకున్న బిజెపికి రాష్ట్ర ప్రజలు పూర్తి మెజార్టీ కట్టబెట్టడం పదేళ్ల కాంగ్రెస్‌ పాలన పట్ల పెరిగిన వ్యతిరేకతకు నిదర్శనంగా చెబుతున్నారు. మొత్తం 90 అసెంబ్లీ సీట్లలో 47 సీట్లను గెలుచు కున్న బిజెపి మొట్ట మొదటిసారిగా పూర్తి మెజార్టీని సాధించగలిగింది. గత పదేళ్లుగా రాష్ట్ర అధికార పీఠం పై పాతుకుపోయిన కాంగ్రెస్‌ బలం 40 సీట్ల నుంచి 15కు పడిపోయింది. అలాగే ముఖ్యమంత్రిగా జైలునుంచే ప్రమాణస్వీకారం చేస్తానని ఎన్నికలకు ముందు తిరుగులేని ధీమా వ్యక్తం చేసిన ఐఎన్‌ఎల్‌డి నేత చౌతాలా కంగుతిన్నారు. కేవలం 19సీట్లతో ఐఎన్‌ఎల్‌ డి మూడో స్థానానికే పరిమితమైంది. ఇన్ని పరిణామాలు బిజెపికి సరైన నాయ కత్వం లేని రాష్ట్రంలో జరగడం విచిత్రం. సరైన నాయకత్వం లేకపోయినా కమలం గుర్తుకే ఓట్లు వేయడం అంటే ఆ విజయాన్ని మోడీకే ఆపాదించాల్సి ఉంటుంది.

మహారాష్టల్రో బిజెపి సాధించిన విజయం అనేక కోణాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో బలంగా వేళ్లూనుకున్న శివసేనతో పొత్తు లేకుం డా పోటీ చేసిన బిజెపి ఏకంగా 122 సీట్లను సొంతబలంతో గెలుచుకో గలిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 47 సీట్లను మాత్రమే గెలుచుకున్న బిజెపి తాజాగా అతిపెద్ద పార్టీగా అవతరించడం శివసేన, ఎన్సీపీల ప్రాబల్యా నికి గండి పడినట్టుగానే భావించాలి. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడా నికి కావాల్సిన 145 సీట్ల సంఖ్యకు చేరుకోవాలంటే బిజెపికి మరో 23 సీట్లు అవసరం అవుతాయి. ఈ విషయంలో శరద్‌పవార్‌ సారథ్యంలోని ఎన్సీపీ బయటి నుంచి మద్దతిచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అడగకుండా మద్దతిచ్చేది లేదని శివసేన తెగేసి చెప్పింది. ఈ నేపథ్యంలో మిగిలిన 23సీట్లకు సంబంధించి బిజెపి ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుంద న్నది ఆసక్తి కలిగిస్తోంది. శివసేనకు 63 సీట్లు వచ్చినప్పటికీ రాజకీయంగా ఎలాంటి నిర్ణయాత్మక పాత్రను పోషించే అవకాశం లేదు. ఎందుకంటే బిజెపికి బయటి నుంచి మద్దతివ్వ డానికి ముందుకొచ్చిన ఎన్సీపీకి 41సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో 81సీట్లను గెలుచుకుని ఎన్సీపీ భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌కు బలం 42 సీట్లకు పడిపోయింది. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పేశక్తిగా భావిస్తున్న రాజ్‌థాకరే సారథ్యంలోని ఎమ్‌ఎన్‌ఎస్‌ దారుణంగా దెబ్బతింది. గత ఎన్నికల్లో 13 సీట్లు గెలుచుకున్న ఈ పార్టీకి కేవలం ఒక్క స్థానం మాత్రమే లభించింది. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న మజ్లీస్‌ పార్టీ రెండు సీట్లను గెలుచుకుని మహారాష్టల్రో రాజకీయ ఖాతా తెరచింది.

మహారాష్టల్రో 1990లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 141 స్థానాలను గెలుచుకుంది. అప్పటినుంచి ఏ పార్టీ కూడా వంద స్థానాలకు చేరువలోకి కూడా రాలేదు. ఈ సారి ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించలేక పోయినప్పటికీ బిజెపి గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన స్థానాలకన్నా దాదాపు మూడు రెట్లు ఎక్కువ సీట్లు గెలుచుకోవడం చిన్న విషయమేమీ కాదు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి దక్కింది 47 సీట్లే. ఆ ఎన్నికల్లో శివసేన-బిజెపి కూటమి సాధించిన 92 స్థానాలకన్నా కూడా ఈ సారి ఒంటరిగా పోటీ చేసిన బిజెపి సాధించిన సీట్లు ఎక్కువ కావడం విశేషం. 1995లో ఈ రెండు పార్టీ లు రాష్ట్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ కూటమికి 138 స్థానాలు లభించాయి. అప్పుడు బిజెపికి 65 స్థానాలు లభిం చగా, శివసేనకు 73 సీట్లు దక్కాయి. 1990లో మొట్టమొదటిసారి బిజెపి, శివసేన కలిసి పోటీ చేసినప్పుడు బిజెపి 104 స్థానాల్లో పోటీ చేసి 42 సీట్లు గెలుచుకుంది. శివసేన 183 స్థానాల్లో పోటీచేసి52 స్థానాలను గెలుచుకుంది. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి, దాని మిత్రపక్షాలు రాష్ట్రంలోని మొత్తం 48 లోక్‌సభ స్థానాల్లో 42 సీట్లను గెలుచుకోవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు అదే హవా కొనసాగడంతో బిజెపిలో కొత్త ఉత్సాహం తొంగిచూస్తున్నది. అయితే ఈ విజయం నిలబెట్టుకోవడానికి మోడీ టీం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.