Articles

బుద్ధి తెచ్చుకోవాలి!


మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కినట్లు పాకిస్తాన్‌ తరచూ సరిహద్దుల్లో కాల్పుల ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఆ నిందను భారత్‌పైకి నెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నది. కశ్మీర్‌ సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని కూడా పాకిస్తాన్‌ కోరుతోంది. భారత్‌ను కట్టడి చేసేందుకు తన పలుకుబడిని ఉపయోగించడంతో పాటుగా కాశ్మీర్‌ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న లక్ష్యాన్ని సాధించే విషయంలో ఐక్యరాజ్య సమితికి ముఖ్య భూమిక ఉందని పాకిస్తాన్‌ నమ్ముతోందని బాన్‌కు రాసిన లేఖలో అజీజ్‌ అభిప్రాయ పడ్డారు. 

ఒకే అసత్యాన్ని పదే పదే చెప్పడం ద్వారా నిజం చేయవచ్చునని పాకిస్తాన్‌ భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. వాస్తవాధీన రేఖ వెంబడి ఈ నెల 1 నుంచి 10వ తేదీ వరకూ భారత్‌ తెగబడి 20 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిందని పాకిస్తాన్‌ చెబుతున్నది. అదే విధంగా అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 22 సార్లు భారత్‌ కాల్పులకు పాల్పడిందని కూడా పాకిస్తాన్‌ ఆరోపిస్తున్నది. భారత్‌ చేసిన ఈ దుందుడకు చర్య వల్ల పాకిస్తాన్‌కు చెందిన 12 మంది పౌరులు మరణించారని, మరో 53 మంది వరకూ గాయపడ్డారని కూడా అభియోగం మోపుతున్నది. ఈ మేరకు పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సలహాదారుడు సర్తార్‌ అజీజ్‌ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌ కి-మూన్‌కు ఒక లేఖ రాయడమే కాకుండా ఈ విషయంలో సమితి జోక్యం చేసుకోవాలని కోరారు. మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కినట్లు పాకిస్తాన్‌ తరచూ సరిహద్దుల్లో కాల్పుల ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఆ నిందను భారత్‌పైకి నెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నది. కశ్మీర్‌ సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని కూడా పాకిస్తాన్‌ కోరుతోంది. భారత్‌ను కట్టడి చేసేందుకు తన పలుకుబడిని ఉపయోగించడంతో పాటుగా కాశ్మీర్‌ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న లక్ష్యాన్ని సాధించే విషయంలో ఐక్యరాజ్య సమితికి ముఖ్య భూమిక ఉందని పాకిస్తాన్‌ నమ్ముతోందని బాన్‌కు రాసిన లేఖలో అజీజ్‌ అభిప్రాయ పడ్డారు. పాకిస్తాన్‌ ఐక్యరాజ్యసమితి ఎదుట చేసిన ఈ వాదన సహేతుకం కాదనే విషయం ప్రపంచం యావత్తూ భావిస్తున్నది. అందుకే పాకిస్తాన్‌ ఈ అంశంలో ఒంటరి పోరాటం చేయాల్సి వస్తున్నది. 

పాకిస్తాన్‌ ఐక్యరాజ్యసమితికి పంపిన ఫిర్యాదులో భారత్‌పై ఎక్కడ లేని నిందలూ మోపింది. భారత్‌ తరచూ ఈ విధంగా తమ దేశంలోకి చొచ్చుకు వస్తున్నదని 2014 లో 174 సార్లు వాస్తవాధీన రేఖ వెంబడి, 60 సార్లు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత్‌ కాల్పులకు పాల్పడిందని కూడా పాకిస్తాన్‌ ఆరోపించింది. అందువల్ల తక్షణమే ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని కశ్మీర్‌ సమస్యను పరిష్కరించాలని అందుకోసం కశ్మీర్‌లో ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని విజ్ఞప్తి చేసింది. అయితే కశ్మీర్‌ సమస్యపై ఐక్యరాజ్య సమితి జోక్యానికి పాకిస్తాన్‌ ఈ విధంగా చేసిన తాజా ప్రయత్నాలు కూడా బెడిసికొట్టా యి. పాకిస్తాన్‌ ప్రయత్నాలకు ఐక్య రాజ్య సమితి ఏ మాత్రం స్పందిం చకపోగా, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడానికి భారత్‌తో చర్చలు జరుపుకోవాలని సూచించింది. ఇరు దేశాల మధ్య సమస్యలు ఉంటే పరస్పరం చర్చించుకోవాలని ఐక్యరాజ్యసమితి పునరుద్ఘాటించడంతో పాకిస్తాన్‌ గొంతులో పచ్చివెలక్కాయపడినట్లుగా అయింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కశ్మీర్‌ సమస్యను అంతర్జాతీయం చేసేందుకు పాకిస్తాన్‌ తన ప్రయత్నాలను మరోసారి ముమ్మరం చేయడం తెలిసిందే. ఇలా చేయడం పాకిస్తాన్‌కు కొత్త కాదు. ఎన్ని సార్లు చెప్పినా పాకిస్తాన్‌ అవాస్తవాలకు ఆసరా దొరకడం లేదు.

అజీజ్‌ రాసిన లేఖ గురించి అక్కడి మీడియా ప్రతినిధులు బాన్‌ డిప్యూటీ సెక్రటరీ ఫరాన్‌ హక్‌ను ప్రశ్నించి ఆయన అభిప్రాయం కోరగా, భారత్‌, పాక్‌లు తమ విభేదాలన్నిటినీ చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు. కశ్మీర్‌లో శాంతి సుస్థిరతల సాధన కోసం ఒక శాశ్వత పరిష్కారాన్ని సాధించడానికి ఇరు దేశాలు నిర్మాణాత్మక చర్చలు జరపాలంటూ గత వారం బాన్‌ చేసిన ప్రకటనను ఆయన గుర్తు చేసారు. భారత్‌‌‌, పాక్‌ల మధ్య అధీన రేఖ వెంబడి ఉద్రిక్తత పెరిగిపోవడం పట్ల ప్రధాన కార్యదర్శి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రాణ నష్టం, ఇరు వైపులా పెద్ద ఎత్తున ప్రజలు నిర్వాసితులు కావడాన్ని ఆయన ఖండిస్తున్నారు అని ఆ ప్రకటన పేర్కొంది. ఈ ప్రకటనైనా పాకిస్తాన్‌ కు కనువిపు్పకలిగించిందో లేదో తెలియదు. తాజాగా ఇంకా జరుగు తూనే ఉన్న కాల్పులను చూస్తే పాకిస్తాన్‌కు తెంపరితనం పోలేదనే అనిపిస్తున్నది. ఒక్క సారిగా పూంఛ్‌ సెక్టార్‌లో భారత్‌ సైనికులు ఎదరు దాడి చేయడంతో వెనక్కు తగ్గిన పాకిస్తాన్‌ మళ్లీ జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి తాజాగా మళ్లీ కాలు్పలకు పాల్పడుతున్నది. కాలు్పల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి జమ్మూలోని పూంఛ్‌ జిల్లాలో సజ్జన్‌ సెక్టార్‌ వెంబడి పాక్‌ సేన కాలు్పలు జరుపుతోందని సీనియర్‌ పోలీసు అధికారి షంషేర్‌ హుస్సేన్‌ తెలిపారు. పాక్‌ కాలు్పలను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది.

వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితిపై గత వారం భారత్‌, పాక్‌ల మధ్య ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో మాటల యుద్ధం జరగడం తెలిసిందే. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా వివాదాస్పదంగా ఉన్న ఈ ప్రాంతంలో సంస్థాగతంగా ఐక్యరాజ్యసమితి దీర్ఘకాలంగా తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. అధీన రేఖతో పాటుగా జమ్మూ, కశ్మీర్‌లో ఈ రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు వెంబడి ఐక్యరాజ్య సమితి సైనిక పరిశీలక బృందం (యుఎన్‌ఎంఓజిపిఐ) రెండు దేశాల మధ్య కాల్పుల వివరమణ ఒప్పందం అమలును పర్యవేక్షించడంతో పాటుగా కాల్పుల ఒప్పందం ఉల్లంఘనకు దారి తీసే పరిణామాలపై సమితికి నివేదికలను సైతం అందజేస్తోంది. అయితే ఈ గ్రూపునకు కాలం చెల్లిపోయిందని, ఈ సమస్యపై అది పోషించదగ్గ పాత్ర ఏమీ లేదని భారత్‌ మొదటి నుంచీ వాదిస్తోంది. భారత్‌ వాదనకు అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి. పాకిస్తాన్‌ పనిగట్టుకుని చేసే ప్రచారం ఎలాంటి ప్రయోజనాన్ని కల్పించడం లేదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్న పాకిస్తాన్‌లో సైన్యం స్వతంత్రించి ప్రవర్తిస్తుందనే విషయం అందరికి తెలిసిందే. పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ చర్చలు జరుపుతుంటే సైన్యం కాల్పులు జరుపుతుంటుంది. ఇలా జరిగే చోట చర్చలు కూడా సఫలం కావు. ఇదే విషయాన్ని భారత్‌ పదే పదే చెబుతున్నది. పాకిస్తాన్‌ తన సైన్యాన్ని అదుపు చేసుకుని చర్చలు రావాల్సి ఉంటుంది. వేర్పాటువాదుతో వద్దంటే చర్చలు జరపడం, కశ్మీర్‌ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం కూడా పాకిస్తాన్‌ మానుకోవాలి. జమ్మూ కశ్మీర్‌ వరద సాయాన్ని కూడా అడ్డుకునే వేర్పాటువాదులతో చేతులు కలిపి భారత్‌పై కక్షసాధిద్దామనుకుంటే అది సాధ్యం కాదు. భారత్‌ అజేయమైనది.