Articles

ఐజెయు కార్య‌వ‌ర్గ స‌భ్యునిగా అచ్యుత‌రావు


విజ‌య‌న‌గ‌రం/  హైద‌రాబాద్ :-  జాతీయస్ధాయి జ‌ర్న‌లిస్టుల సంఘాల‌లో అత్యంత ప్రాచుర్యం, కేంద్ర‌ప్ర‌భుత్వ గుర్తింపు క‌లిగిన ఇండియ‌న్ జ‌ర్న‌లిస్ట్స్ యూనియ‌న్ (ఐజెయు) కార్య‌వ‌ర్గంలో సీనియ‌ర్  జ‌ర్న‌లిస్ట్ దిమిలి అచ్యుత‌రావుకు స్ధానం ల‌భించింది. ఒడిషా రాష్ట్రం భువ‌నేశ్వ‌ర్‌లో ఈనెల 23-24 తేదీల‌లో జ‌రిగిన 8వ‌ జాతీయ మ‌హా స‌భ‌ల సంద‌ర్భంగా జ‌రిగిన ఎన్నిక‌ల‌లో జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యునిగా అచ్యుత‌రావు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. అచ్యుత‌రావు ఎన్నిక‌ను సీపీఆర్‌వో బిఎస్ రామ‌కృష్ణ ప్ర‌క‌టించారు. రెండేళ్ల ప‌ద‌వీకాలం క‌లిగిన ఈ ప‌ద‌వికి అచ్యుత‌రావు ఎన్నిక‌ద్వారా తొలిసారిగా ఐజెయు కార్య‌వ‌ర్గంలో ఉత్త‌రాంధ్ర‌కు ప్రాతినిధ్యం ల‌భించిన‌ట్ల‌యింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ యూనియ‌న్ ఆఫ్ వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్ట్స్ (ఎపీయూడ‌బ్ల్యూజె) త‌ర‌పున ఐజెయు కార్య‌వ‌ర్గంలో స్ధానం పొందిన దిమిలి అచ్యుత‌రావు గ‌త 30 ఏళ్లుగా యూనియ‌న్‌కు సేవ‌లందిస్తున్నారు. దీనికి గుర్తింపుగా ఆయ‌న‌కు ఈ ప‌ద‌వి ల‌భించింది. త‌న ఉన్న‌తికి స‌హ‌క‌రించిన ఐజెయు నాయ‌కులు కె.శ్రీ‌నివాస‌రెడ్డి, దేవుల‌ప‌ల్లి అమ‌ర్‌, అమ‌ర్‌నాధ్‌, ఆంజ‌నేయులుకు అచ్యుత‌రావు కృతజ్ఞ‌త‌లు తెలిపారు. ఎపీయూడ‌బ్ల్యూజెలో రెండు సార్లు ఉపాధ్య‌క్షునిగా, మూడుసార్లు కార్య‌ద‌ర్శిగా, రెండుసార్లు కార్య‌వ‌ర్గ స‌భ్యునిగా, ఒక‌సారి ప్ర‌త్యేక ఆహ్వానితునిగా సేవ‌లందించిన అచ్యుత‌రావు జాతీయ కౌన్సిల్ స‌భ్యునిగా ఇప్పుడ జాతీయ కార్య‌వ‌ర్గంలో ప‌ద‌విని చేప‌ట్టారు. గ‌తంలో ప్రెస్ అకాడ‌మీ పాల‌క‌వ‌ర్గ స‌భ్యునిగా, జ‌ర్న‌లిస్టుల సంక్షేమ క‌మిటీ, గ్రామీణ జ‌ర్న‌లిస్టుల క‌మిటీ క‌న్వీన‌ర్‌గా, విజ‌య‌న‌గ‌రం జిల్లా అక్రిడిటేష‌న్ క‌మిటీ స‌భ్యునిగా సేవ‌లందించిన ఆయ‌న 1991లో విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎపీయూడ‌బ్ల్యూజె శాఖ‌ను పున‌:ప‌్రారంభించారు. 1992లో విజ‌య‌న‌గ‌రం ప్రెస్‌క్ల‌బ్‌ను ప్రారంభించి వ్య‌వ‌స్ధాప‌క అధ్య‌క్షునిగా పేరుగాంచారు.1982లో విశాఖ జిల్లా మాడుగుల కేంద్రంగా ఈనాడు కంట్రిబ్యూట‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయ‌న అదే ప‌త్రిక‌లో ఉప‌సంపాద‌కుని స్ధాయికి ఎదిగి అనంత‌రం ఆంధ్ర‌ప‌భ, ఆంధ్ర‌భూమి లీడ‌ర్ దిన‌ప‌త్రిక‌ల‌లోనూ, ప‌లు టీవీ ఛాన‌ల్స్‌లోనూ ప‌నిచేశారు. ప్ర‌స్తుతం ఎక్స్‌ప్రెస్ మీడియాలో ప‌నిచేస్తున్న అచ్యుత‌రావు దాదాపు ప‌ది ప‌త్రిక‌ల‌కు కాల‌మిస్ట్‌గా సుప‌రిచితులు. ప్రాణాల‌కు తెగించి ఎన్నోఅవినీతి ఉదంతాల‌ను ప‌త్రిక‌ల ద్వారా వెలుగులోకి తెచ్చిన ఆయ‌న ఎన్నో అవార్డులు, రివార్డులు, .స‌త్కారాలు, స‌న్మానాలు అందుకున్నారు. అచ్యుత‌రావు ఎన్నిక ప‌ట్ల ఎపీయూడ‌బ్ల్యూజె ప్ర‌స్తుత అధ్య‌క్షుడు డి.సోమ‌సుంద‌ర్‌, నూత‌నంగా ఎన్నికైన న‌ల్లిధ‌ర్మారావు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఐవి సుబ్బారావు, ఉపాధ్య‌క్షుడు రాము, విజ‌య‌న‌గ‌రం జిల్లాశాఖ అధ్య‌క్ష, కార్య‌ద‌ర్శులు శివ‌ప్ర‌సాద‌రావు, మ‌హాపాత్రో, సంఘ నాయ‌కులు రాధాకృష్ణ‌, శేష‌గిరి, వైఎస్ పంతులు, గురుప్ర‌సాద్‌, ఎస్పీరాజు,బి.శంక‌రావు, సీతారాం త‌దిత‌రులు త‌మ హ‌ర్షం వ్య‌క్తం చేశారు