Articles

ఫూలే బాటలో కేసీఆర్


మహాత్మా జ్యోతిరావు ఫూలే మాటలను స్ఫూర్తిగా తీసుకొని బీసీల కోసం రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభిస్తున్నాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం ముదావహం. ఇది స్వాగతించే సామాజిక అంశం.ప్రస్తుతం ఎంబీసీలకు కావలసిందేమిటి? విద్యాగంధం. ఆ విద్యాగంధం ద్వారా భవిష్యత్తును పరిమళింపజేసుకోవాలనుకుంటున్నారు. బంగారు తెలంగాణలో పరిఢవిల్లి, రాష్ర్టానికి, దేశానికి సేవ చేయాలనుకుంటున్నారు. గర్వించదగ్గ పౌరులుగా జీవించాలనుకుంటున్నారు.

\r\n

ఇక్కడ ఫూలే విద్య ప్రాముఖ్యం గురించి తెలిపిన ఆచరణీయమైన సందేశం ఏమేంటే..

\r\n

విద్యలేక వివేకము లేదు

\r\n

వివేకము లేక నీతి లేదు

\r\n

నీతి లేనిదే పురోగతి లేదు

\r\n

పురోగతి లేక విత్తం లేదు

\r\n

విత్తం లేకనే శూద్రులు

\r\n

అథోగతి పాలయ్యారు..

\r\n

ఇంత అనర్థం ఒక్క అవిద్య వల్లనే.

\r\n

మాక్స్ ముల్లర్ లాంటి పండితులు తీసుకొచ్చిన ఆర్య సిద్ధాంతాన్ని బ్రాహ్మణ మేధావులు తమకు తాము ఆర్యులుగా చెప్పుకొని బ్రిటీష్ వారితో సఖ్యంగా వున్న రోజులవి. కానీ మహాత్మా ఫూలే గ్రామ సమాజంలోను, కుటుంబంలోను విప్లవాత్మక మార్పులను కోరుకొని పురాణాలను భౌతికవాద దృక్పథంతో వ్యాఖ్యానించారు. ఫూలే తాను ప్రతిపాదించిన ఆర్యేత సిద్ధాంతాన్ని తాను స్థాపించిన సత్యశోధక్ సమాజం ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన భారత సామాజిక విప్లవానికి సిద్ధాంత భూమికను అందించిన తొలి ఆధునిక సామాజిక విప్లవకారుడు.

\r\n

బడుగు, బలహీనవర్గాల పిల్లలు విలువ కలిగిన విద్య పొందాలని వారంతా వివేకవంతులుగా మారి పురోగతి చెంది తద్వారా జాతి సంపదను పెంచాలని ఫూలే నాడు వినిపించిన సందేశం నేడు సీఎం మాటలు అసెంబ్లీ సాక్షిగా వినిపించడం హర్షణీయం. ఆయన మాటలు చేతలు కావాలని ఆశించని బీసీలు ఉండరు.

\r\n

సీఎం కేసీఆర్ ప్రభుత్వం బీసీల కోసం 119 రెసిడెన్షియల్ పాఠశాలలు పెడుతున్నట్లు చెప్పారు. అవి ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటాయన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 119 రెసిడెన్షియల్ పాఠశాలల కంటే బీసీ కులాల జాబితా సంఖ్య ఎక్కువగా ఉన్నది. ఈ జాబితాలో అభివృద్ధి చెంది న కులాలను కూడా చేర్చిన బీసీ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇందులో ముస్లింలను కూడా కలిపి ఏ,బీ,సీ,డీకి తోడు మరో ఈ కలిపారు. ఈ జాబితా తడిసి మోపెడై లంకా దహనం చేసిన హనుమంతుని తొకలా తయారైం ది. అంటే ఈ ఉపమానంలో సూక్ష్మం గ్రహిస్తే ప్రభుత్వ విధానాలకు తెరపడుతుంది.

\r\n

శతకం దాటిన బీసీ కులాల జాబితాను ప్రాతిపదికగా చేసుకొని ఇప్పటిదాకా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. కానీ కొన్ని కులాలకు మాత్ర మే ఆ ఫలాలు అందుతున్నాయి. అయితే బీసీ కులాల్లో అత్యం త వెనుకబడిన కులాలకు ప్రయోజనాలు అందటం లేదు. 

\r\n

సమాజంలో అగ్రవర్ణాలున్నట్లే బీసీల్లో కూడా అగ్రకులాలున్నాయి. ఆధిపత్య కులాలున్నాయి. అగ్రవర్ణాలు మూడు, నాలుగు అయితే బీసీల్లో కూడా ఎనిమిది నుంచి పది వరకు ఆధిపత్య కులాలున్నాయి. చివరికి చెప్పడమేమంటే బీసీ కులాల్లో ఎదిగిన కులాలు చట్టసభలకు ఎన్నికై న కులాలు గౌడ, యాదవ, మున్నూరుకాపు, పద్మశాలి, ముదిరాజ్ వంటి కులాలున్నాయి. మొత్తం రాష్ట్ర బీసీ జనా భా 52 శాతం అయితే 1931 జనాభా లెక్కల ప్రకారం మండల కమిటీ రిపోర్టు ప్రకారం అనుకున్నారు. ఎం బీసీలు 38 శాతంగా ఉన్నారు. ప్రస్తుతం జనగణన చేస్తే ఎంబీసీల జనాభా అధికంగానే ఉంటుంది. ఈ విషయాన్ని మున్సిపల్ పంచాయతీ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా చేసిన జనభా లెక్కలు నిరూపిస్తున్నాయి. ఈ అత్యంత వెనుకబడిన బీసీ కులాల్లో కొన్ని కులాల పేర్లు ప్రజాప్రతినిధులకు తెలియకపోవడం శోచనీయం.

\r\n

ఈ సమాచారం కోసం పాలకులకు ప్రజాప్రతినిధులకు, ప్రజలకు అత్యంత వెనుకబడిన కులాలలోని కొన్ని పేర్లను ఇక్కడ ఉదహరిస్తున్నాం. ఎంబీసీ కులాల్లో.. బాలసంతు, బుడబుక్కల, రజక, దాసరి, దొమ్మర, గంగిరెద్దుల వారు, జంగమ, జోగి, మేదరి, మొండివారు, మొండిబండ, నాయీబ్రాహ్మణ, వంశరాజ్ (పిచ్చకుంట్ల), పాముల, వాల్మీకి బోయ, గూడల, జోషినంది వాలాస్, ఒడ్డె, కూనపులి, దూదేకుల, గాండ్ల, తెలికుల, జాండ్ర, కుమ్మర, కురు బ లేదా కురుమ, పట్కార్, పెరిక, కుర్ని, విశ్వబ్రాహ్మణ, ఆరె కటిక, భట్రాజ్, చిప్పోలు, సూర్యబలిజ, కృష్ణబలిజ, మాలి, పూసల, పస్సి, సాతాని, తమ్మలి, ఉప్పర, వంజర వంటి కులాలతోపాటు చాలా ఎంబీసీ కులాలున్నాయి.

\r\n

ఈ కులాలేగాక బీసీ జాబితాలోని 90 శాతం కులాలు అత్యంత వెనుకబడి తరతరాలుగా అణచివేతకు, దౌర్జన్యానికి గురవుతూ వచ్చాయి. ఇప్పటికీ ఈ కులాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లు అయిన వారు లేరు. పదవ తరగతి పాస్ అయిన వారు ఎక్కడో గానీ కనిపించరు. ఇక యూనివర్సి టీల గడప తొక్కినవారు అస్సలు కనిపించరు. ఔట్‌సోర్సిం గ్ పేరిట ప్రైవేట్ సంస్థలు పుట్టుకొచ్చి బీసీ, ఎంబీసీల ఉద్యోగాలకు అడ్డుపడ్డాయి. ఇలా సాగిన ఎంబీసీ కులాల అణచివేత గురించి రాష్ట్ర ముఖ్యమంత్రులకు కేంద్ర ప్రభుత్వాలకు ఎన్నోమార్లు మెమొరాండాలు సమర్పించాం. కానీ ప్రయోజనం శూన్యం.

\r\n

ప్రస్తుతం బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు 119 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ గురుకులాల్లో బీసీలలో అత్యంత వెనుకబడిన కులాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. సామాజికంగా, ఆర్థికంగా, విద్య, ఉద్యోగపరంగా ఎంబీసీలు అత్యంత వెనుకబడి ఉన్నారు. వారి జీవనం దయనీయ స్థితిలో ఉన్నది. వారి పిల్లలు చదువుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వం నెలకొల్పబోయే నియోజకవర్గానికి రెసిడెన్షియల్ పాఠశాలల చొప్పున అం చనాల ప్రకారం 76 వేల పైచిలుకు సీట్లు ఉంటాయని చెప్పారు. ఇందులో ఎంబీసీల సామాజిక వెనుకబాటు, విద్యాపరంగా వెనుకబాటుతనం అనే రెండు అంశాలను ఆధారంగా తీసుకొని ఈ వర్ణ వ్యవస్థలో తరతరాలుగా అణగారిన ఎంబీసీ కులాలను పరిగణనలోకి తీసుకొని వారికి 46 నుంచి 50 వేల సీట్లను కేటాయించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దిశగా చర్యలు తీసుకోవాలి.

\r\n

ప్రస్తుతం ఎంబీసీలకు కావలసిందేమిటి? విద్యాగం ధం. ఆ విద్యాగంధం ద్వారా భవిష్యత్‌ను పరిమళింపజేసుకోవాలనుకుంటున్నారు. బంగారు తెలంగాణలో పరిఢవి ల్లి, రాష్ర్టానికి దేశానికి సేవ చేయాలనుకుంటున్నారు. గర్వించదగ్గ పౌరులుగా జీవించాలనుకుంటున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంబీసీ కులాల పిల్లలకు త్వరలో ఏర్పాటుచేయనున్న 119 గురుకు పాఠశాలల్లో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి 50 వేల వరకు సీట్లు కేటాయించాలి. ఈ విధాన నిర్ణయం తీసుకోవడం ద్వారా సీఎం కేసీఆర్ పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.

\r\n

(వ్యాసకర్త: జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు)

\r\n

నమస్తే తెలంగాణ సౌజన్యంతో