Articles

ఎంబీసీలకు భరోసా


ఎంబీసీల కోసం ప్రాథమిక విద్యనుంచి ఉన్నత చదువుల వరకు గురుకులాల్లో ఉచిత విద్య, బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ఎంబీసీలకు 90 శాతం సబ్సిడీతో రుణ సౌకర్యం, విదేశీ విద్యలో ఎంబీసీలకు ప్రాధాన్యం, రాజకీయాల్లో నామినేటెడ్ పదవులు ఇవ్వడం వంటి హామీలను ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే.

\r\n

గొప్ప విజన్ ఉన్న ముఖ్యమంత్రి కేసీ ఆర్ ఎంబీసీల గురించి పలుమా ర్లు శాసనసభలో, బయట ప్రస్తావించా రు. ఎంబీసీలను గుర్తించడమేగాక ప్రత్యేక ఎంబీసీ కార్పొరేషన్‌ను ఏర్పా టుచేశారు. అయితే కొందరు వ్యక్తులు, కొన్ని పార్టీల వారు ఎంబీసీ అనే పదా న్నే జీర్ణించుకోలేక పోతున్నారు. కానీ ఎంబీసీలకు ఎంబీసీల ప్రస్తావన స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 70 ఏండ్లుగా ఉనికిలో ఉన్నది. సమాజం లో బీసీలు ఎప్పటినుంచి ఉన్నారో అప్పటినుంచి ఎంబీసీలు ఉన్నారు.

\r\n

కాలేల్కర్ కమిషన్ తన నివేదికలో దేశంలో 2399 బీసీ కులాలున్నాయని, ఇందులో 837 కులాలు అత్యంత (ఎంబీసీ) వెనుకబడినవని తేల్చింది. విద్య లేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగాల్లో, పారిశ్రామిక రంగంలో, రాజ కీయాల్లో ప్రాతినిధ్యం లేకపోవడం, భూమిలేని నిరుపేద లు, వ్యవసాయ కూలీలు, సరైన సంపాదన లేనివాళ్ళు, ఇళ్ళు లేనివాళ్ళు, యాచకవృత్తిలో ఉన్నవారు, అభివృద్ధి చెందిన కులాలతో పోల్చుకొని ఆత్మన్యూనతతో బతికేవా రు మొదలైన అంశాల ఆధారంగా 837 కులాలు అత్యంత వెనుకబడి ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నది. కాలేల్కర్ నివేదిక (1953-1955) హైదరాబాద్ రాష్ట్రంలో 68 కులాలు ఉన్నట్లు నిర్ధారించింది. 

\r\n

మండల్ కమిషన్ 54 శాతం ఓబీసీలున్నట్లు నిర్ధారిం చింది. 1980 డిసెంబర్ 31న బీపీ మండల్ తుది నివేదికను సమర్పిస్తూ- 1931లో కులాల వారీగా చేసిన జనాభా గణనను ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురైనాయని పేర్కొన్నారు. 1931 తర్వాత కులా ల ప్రస్తావన లేకుండా జనాభా గణన జరుగుతూ వచ్చింది. 1979 జూన్‌లో ఒక లేఖను, 1979 ఆగస్టు 18న రెండో లేఖను అప్పటి హోంమంత్రులైన హెచ్‌ఎం పటేల్, వై.బి. చవాన్‌లకు, భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కులాల వారీగా జనాభాగణన చేయాలని లేఖలు రాశానని పేర్కొన్నారు. 1980 మార్చి 31న హోంమంత్రి జైల్‌సింగ్‌కు మూడో లేఖ రాస్తూ 1981లో జరిగే జనగణనలో కూడా కులాల నమోదు జరుగదని తెలిసిందని దీన్ని పునర్‌పరిశీలించాలని కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా కోరారని తెలిపారు. మండల్ కమిషన్ సభ్యుడు ఎల్.ఆర్. నాయక్ చేసిన సూచనలను నివేదికలో 7వ భాగంగా చేర్చారు. ఇందులో ఓబీసీలను ఇంటర్మీడియెట్ వెనుకబడిన తరగతులుగా, డిప్రెస్డ్ బ్యాక్‌వర్డ్ క్లాసులుగా రాష్ట్రా ల వారీగా రెండు రకాలుగా విభజించాలన్నారు. ఎల్.ఆర్. నాయక్ అభిప్రాయం ప్రకారం డిప్రెస్‌డ్ బ్యాక్‌వర్డ్ క్లాసులను ఇంటర్మీడియెట్ బ్యాక్‌వర్డ్ క్లాసులతో చేర్చితే నష్టపోయేది రెండోవర్గం వారే.

\r\n

1971లో బీహార్ ప్రభుత్వం నియమించిన ముంగేరిలాల్ ఛైర్మన్‌గా ఉన్న బీసీ కమిషన్ 128 కులాలను వెనుకబడిన తరగతులకు చెందినవని ఇందులో 94 కులాలు అత్యంత వెనుకబడిన కులాలని పేర్కొన్నది. యూపీ ప్రభు త్వం అత్యంత వెనుకబడిన తరగతుల కమిషన్‌ను 1975 అక్టోబర్‌లో నియమించింది. కమిషన్ ఎంబీసీలను మూ డు కేటగిరిలుగా విభజించాలని సూచించింది. ఎంబీసీల కు పుదుచ్చేరిలో 13 శాతం, మహారాష్ర్టలో 2 శాతం, జార్ఖండ్‌లో 8 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 10 శాతం, బీహార్‌లో 18 శాతం, తమిళనాడులో 20 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు.

\r\n

1970 జూన్ 25న అనంతరామన్ కమిషన్ నివేదిక 93 కులాలను సామాజికంగా విద్యాపరంగా వెనుకబడి ఉన్నాయని, వాటిని గ్రూప్ ఎ 7 శాతం, గ్రూప్ బి 10 శాతం, గ్రూప్ సి 1 గ్రూప్ డి 7 శాతం అనే నాలుగు గ్రూపులుగా విభజించి 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫా ర్సు చేసింది. నాలుగు గ్రూపులుగా విభజించిన 93 కులాల్లో డీ నోటిఫైడ్ కు చెందిన 29 కులాలను బీసీ జాబితాలో చేర్చారు. బీ, డీ గ్రూప్‌లో కొన్ని అత్యంత వెనుకబడిన కులాలున్నాయ ని గమనించాలి. దీన్ని బట్టి పరిశీలిస్తే అత్యంత వెనుకబా టు కులాలను బీసీ ఏ జాబితాలో చేర్చారని గమనించాలి.

\r\n

కాలేల్కర్, మండల్, అనంతరామన్ కమిషన్ల నివేదిక లో పేర్కొన్న అత్యంత వెనుకబడిన కులాలు అన్నీ తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన బీసీ జాబితాలో ఉన్నవేనని గ్రహించాలి. జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)ను ఉప కులాలుగా విభజించాలని 2015 మార్చి 2న కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. జస్టిస్ ఈశ్వరయ్య నివేదికలోని సిఫార్సులను పరిశీలిస్తే ఓబీసీలలోనే వైరుధ్యాలున్నాయని తెలుస్తుంది. ఓబీసీలను మూడు క్యాటగిరీలుగా విభజిస్తే అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

\r\n

సీఎం కేసీఆర్ ఎంబీసీ పదాన్ని శాసనసభా వేదికగా ప్రస్తావించకముందు చాలా కసరత్తే చేశారు. ఎంబీసీలు వారి స్థితిగతులపై జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష హోదాలో నేను శాసనసభాపతి, ఆర్థిక శాఖామాత్యులతో పలు దఫాలుగా చర్చించడం జరిగింది. ఆ చర్చల సారాంశం పరిశీలించిన తర్వాతనే ఎంబీసీలపై ముఖ్యమంత్రి సమగ్ర నివేదిక రూపొందించారు. అలాగే ఎం బీసీలు ఉనికిలో ఉన్న పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో మన రాష్ట్రం నుంచి అధికారులను పంపించి అధ్యయనం చేయించారు. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటుచేశారు. వెయ్యి కోట్లు కేటాయించారు. 

\r\n

ఎంబీసీల గురించి నివేదిక ను సమర్పించడానికి ఆరు నెలలు గడువు విధించారు. ఆషామాషీగా కాకుండా ఎంతో కసరత్తు చేసిన తర్వాతనే సీఎం కేసీఆర్ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.ఇప్పుడున్న ఏ, బీ, సీ, డీలను బీసీ కమిషన్ ద్వారా అధ్యయనం జరిపించి నివేదిక రూపొందించాలి. ఆ నివేదిక రాబోయే తరాల (బీసీ, ఎంబీసీ)కు ప్రామాణికమై నదిగా ఉపయోగపడాలి. అలాగే ఎంబీసీల కోసం ప్రాథమిక విద్యనుంచి ఉన్నత చదువుల వరకు గురుకులాల్లో ఉచిత విద్య, బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ఎంబీసీలకు 90 శాతం సబ్సిడీతో రుణ సౌకర్యం, విదేశీ విద్యలో ఎంబీసీలకు ప్రాధాన్యం, రాజకీయాల్లో నామినేటెడ్ పదవులు ఇవ్వడం వంటి హామీలను ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే. ఇటీవల జరిగిన ప్లీనరీ సమావేశాల్లో కూడా ఎం బీసీ కులాలు 93 ఉన్నాయని ఆ కులాలన్నీంటికి న్యాయం చేస్తామని ప్రకటించారు. ఇవన్నీ వేగంగా అమలయితే ఎం బీసీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరాధ్యులుగా చరిత్రలో నిలిచిపోతారు.

\r\n

(వ్యాసకర్త: కె.సి. కాళప్ప, అధ్యక్షులు, జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం)