News

జోగు రామన్న కుమారుడిపై హత్య కేసు


మంత్రి జోగు రామన్న కుమారుడు ప్రేమ్‌చంద్‌పై పోలీసులు హత్య కేసునమోదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన కాంగ్రెస్ కార్యకర్త తిరుపతిరెడ్డి హత్య కేసులో ప్రేమ్‌చంద్‌ను నిందితుడిగా మృతుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అతడితో పాటు టీఆర్‌ఎస్‌కు చెందిన మరో 9 మందిపై సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేశారు. తిరుపతిరెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ మృతిపై తిరుపతిరెడ్డి కుటుంబసభ్యులు హత్యకేసుగా పరిగణించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిచ్చిన ఫిర్యాదులో మంత్రి జోగు రామన్న కుమారుడితో పాటు అదే గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేతలపై ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ హత్యపై జిల్లాలో రెండు రోజులుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ఈ ఆందోళన నేపథ్యంలో పోలీసులు ఎట్టకేలకు ప్రేమ్‌చంద్‌పై హత్య కేసు నమోదు చేశారు. గ్రామంలో నెలకొన్న ఆధిపత్య గొడవల్ల ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు.