News

ఐటీ రంగ పురుభివృద్దిలో యువత కీలకపాత్ర


మంత్రి కేటీఆర్ నగరానికి మరిన్ని ప్రతిష్టాత్మక సంస్థలు రానున్నాయని, ఐటీ రంగ పురుభివృద్దిలో యువత కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. వేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్, ప్రపంచంలో గుర్తింపు పొందిన నగరంగా నిలిచిందని మాదాపూర్ హెచ్ఐసీసీలో జరిగిన 2017 విఎల్ఎస్ఐడీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో మంత్రి చెప్పారు. దేశ జనాభాలో 65 శాతం 35 ఏళ్ల లోపు వారేనని, శక్తిమంతమైన మానవవనరులున్న దేశమని అన్నారు. ఐటీ రంగంలో అనూహ్య పురోగతిని సాధిస్తున్నామని కేటీఆర్ అన్నారు. త్వరలో హైరాబాద్‌కు రానున్నవిఎల్ఎస్ఐ డిజైనింగ్ అకాడిమీతో ఎందరో యువకులకు అవకాశాలు వస్తాయని మంత్రి అభిప్రాయపడ్డారు.