News

అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు


ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే సీటు తనదేనని, తనను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని అన్నారు. సోమవారం బాపట్లో టీడీపీ కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సతీష్ ఉద్వేగంగా మాట్లాడారు. కొందరు కావాలనే తనపై కేసు పెట్టించి రాద్దాంతం చేశారన్నారు. చంద్రబాబు కోసం ప్రాణాత్యాగానికైనా సిద్ధమన్న సతీష్.. టీడీపీ గెలుపుకోసం ఎంతదూరమైనా వెళ్తానన్నారు. బాపట్ల టూరిజం సిబ్బందిని కొట్టినట్లు కేసు నమోదైన నేపథ్యంలో సతీష్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత చోటుచేసుకుంది.