News

కోడి పందేల గురించి మాకు తెలియదు


తమిళనాడులో జల్లికట్టు, మహారాష్ట్రలో బుల్‌ఫైట్‌పై సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచి ఉన్నామని కేంద్రమంత్రి అనిల్‌ దవే తెలిపారు. ఈ విషయమై సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. హింస లేని సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించడంలో తప్పు లేదన్నారు. ఇదే సమయంలో ఏపీలో కోడిపందేల నిషేధంపై ప్రశ్నించగా.. ఏపీలో కోడిపందాల నిర్వహణ అంశం తమ దృష్టికి రాలేదన్నారు.