News

కేసీఆర్ చౌకబారు విమర్శలను మానుకోవాలి


ముఖ్యమంత్రి కేసీఆర్ చౌకబారు విమర్శలను మానుకోవాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఆయన ప్రారంభించిన మహాజన పాదయాత్ర బుధవారం ఖమ్మం పట్టణానికి చేరుకుంది. ఈ సందర్బంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో నిర్మించే ఆయా సాగునీటి ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయే నిర్వాసితులకు పరిహారం చెల్లించాలన్నారు. అలాగే ఆయా సమస్యలపై పోరాడడంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని తమ్మినేని విమర్శించారు.