News

20 మంది రౌడీ షీటర్ల అరెస్టు


నగరంలోని వెస్ట్ జోన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు 20 మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరు పలు అసాంఘిక కార్యకలాపాలు, బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి రౌడీ షీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మల్లెపల్లి, ఆఫీస్‌నగర్, దోబీఘాట్ తదితర ప్రాంతాలలో బుధవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించి రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. అందులో కొందరిపై నాన్‌బెయిలబుల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, తప్పించుకుని తిరుగుతున్నారని, అంతే కాకుండా పోలీసుల హెచ్చరికలను ఖాతరు చేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్న అభియోగాలు ఉన్నాయి. వీరికి మొదటిసారి కౌన్సిలింగ్ ఇస్తామని, వినకపోతే పీడీయాక్ట్‌లో నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు.