News

చంద్రబాబును కలిసిన స్పీకర్‌ కోడెల


ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని అసెంబ్లీ స్పీకర్  కోడెల శివప్రసాదరావు బుధవారం కలిశారు. ఫిబ్రవరిలో జరిగే ఉమన్‌పార్లమెంటేరియన్‌ సదస్సు ఏర్పాట్లపై వీరిద్దరు చర్చించారు. కాగా... ఈ సమావేశాలు మూడు రోజులపాటు జరగనున్నాయి. పక్కా ప్రణాళికతో ఈ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే... వెలగపూడిలో అసెంబ్లీ భవన నిర్మాణంపై కూడా సీఎం, స్పీకర్‌ చర్చించారు. ఫిబ్రవరి 15 తర్వాత అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరపాలని, మూడు రోజుల గ్యాప్‌తో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.