News

ఏపీకి తమిళనాడు సీఎం పన్నీర్‌ సెల్వం


తమిళనాడు సీఎం పన్నీర్‌ సెల్వం రేపు ఏపీలో పర్యటించనున్నారు. రేపు మ.1 గంటకు చంద్రబాబుతో పన్నీర్‌ సెల్వం భేటీ కానున్నారు. తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని సెల్వం బాబును కోరనున్నారు. జయలలిత మృతి, తదనంతర పరిణామాలు కూడా చర్చకొచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. శశికళ సీఎం కాబోతోందంటూ వస్తున్న వార్తలపై అన్నాడీఎంకేలో ఇప్పటికే అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పన్నీరు సెల్వం ఇటీవలే మోదీని కూడా కలిశారు.