News

ముఖ్యమంత్రిపై షూ విసిరన యువకుడు


పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ బాదల్‌పై ఓ దుండగుడు షూ విసరడం కలకలం సృష్టించాడు. బుధవారం లంబి జిల్లాలోని సంగత్ దర్శన్‌లో పాల్గొన్న సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. తనపై షూ విసిరిన యువకుడిపై బాదల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారనీ.. అది ఆయనను బలంగా తాకడంతో చేతిలో ఉన్న గ్లాస్ కూడా పగిలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. మంగళవారం లాల్‌భాయ్ అనే గ్రామంలో ఆయన ప్రసంగిస్తుండగా అక్కడి ప్రజలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. ఆ మరుసటి రోజే ఈ సంఘటన జరగడం గమనార్హం. గత వారంలో బాదల్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన తొలిరోజు కొందరు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. ప్రభుత్వం తమకు నిధులు ఇవ్వని కారణంగా కనీసం మరుగుదొడ్లు కూడా నిర్మించుకోలేక పోయామని ఆ ర్యాలీలోని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా బుధవారం ఆయనపై షూ విసిరిన వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టుచేసి విచారణ జరుపుతున్నారు. ప్రకాశ్ సింగ్ బాదల్‌పై ఇలా షూ విసరడం ఇది రెండోసారి. 2014లో ఇస్రూలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ వ్యక్తి షూ విసిరాడు.