News

బాబు కాళ్లు మొక్కిన సతీష్ రెడ్డి


సింహాద్రిపురం పైడిపాలెం చెరువులోకి నీళ్లు వస్తేనే గెడ్డం తీస్తానని శపథం చేసిన టీడీపీ శాసనమండలి డిప్యుటీ చైర్మన్ సతీష్ రెడ్డి తాను చేపట్టిన జలదీక్షను విరమించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పంతో సతీష్ రెడ్డి కల నిజమైంది. గండికోట రిజర్వాయర్ ద్వారా పైడిపాలెం చెరువులోకి నీళ్లు వచ్చాయి. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తన శపథం నెరవేరడంతో సతీష్ రెడ్డి, చంద్రబాబు కాళ్లపై పడ్డారు. పాదాభివందనం చేశారు. తన జలదీక్షను విరమించారు. పైడిపాలెంకు నీళ్లు రావడం సంతోషంగా ఉందని సతీష్ రెడ్డి చెప్పారు.