News

వీసా ఇచ్చే ప్రసక్తే లేదు:సుష్మా


ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రివర్ణ పతాకాన్ని ముద్రించిన డోర్ మ్యాట్‌లను ఆన్‌లైన్‌లో అమ్మడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లి ఇలా చేస్తే అమెజాన్ సంస్థ ఉద్యోగులకు వీసా ఇచ్చే ప్రసక్తే లేదని ఆమె ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు. దీంతో తమ వెబ్ సైట్ నుంచి ఆ ఉత్పత్తులను అమెజాన్ సంస్థ తొలగించింది. ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఉన్న డోర్ మ్యాట్లను కెనడాలో అమెజాన్ విక్రయించింది. ఈ విషయాన్ని ప్రవాస బారతీయులు సుష్మా దృష్టికి తీసుకువెళ్లారు.