News

రేకుల షెడ్ నుంచి ఈ స్ధాయికి


రేకుల షెడ్‌ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టును ఈ స్థాయికి తీసుకు వచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. గన్నవరం ఎయిర్‌పోర్టును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన టెర్మినల్‌ ప్రారంభించటం ఆనందంగా ఉందన్నారు. పౌర విమాన రంగంలో గ్రోత్‌రేట్ ఎక్కువగా ఉంది దీంతో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయన్నారు. అంతర్జాతీయ సేవలను విస్తరిస్తే పెట్టుబడులు వస్తాయని చంద్రబాబు తెలిపారు. జిల్లాకు ఒక ఎయిర్‌పోర్టు రావాలనేది తన కోరిక అని చంద్రబాబు తెలిపారు. భూముల కొరత వల్లే విజయవాడ అభివృద్ధి కాలేదన్నారు. అమరావతి నిర్మాణానికి 750 ఎకరాల భూములిచ్చిన రైతులకు అభినందనలు తెలిపారు. త్వరలో వారికి రాజధానిలో స్థలాలు కేటాయిస్తామన్నారు. ఆగ్రో ఉత్పత్తుల ఎగుమతులకు ఇక్కడ అవకాశం ఉందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. గన్నవరం నుంచి నేరుగా మచిలీపట్నానికి రోడ్డు వేస్తే పోర్టుకు కనెక్టివిటీ వస్తుందన్నారు. రైతులు చెప్పుడు మాటలు వినకుండా భూములు ఇస్తే త్వరలో పోర్టు పనులు ప్రారంభిస్తామని సీఎం స్పష్టం చేశారు.