News

మోదీ ముస్లింలకు వ్యతిరేకం కాదు


ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముస్లిమ్ లకు వ్యతిరేకం కాదని ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నరు నజీబ్ జంగ్ చెప్పారు. మైనారిటీల పట్ల మోదీ పక్షపాతం చూపిస్తారని కొందరు రాజకీయ వ్యతిరేకులు ఆరోపణలు చేస్తుంటారని ఆయన పేర్కొన్నారు. ఇటీవల లెఫ్టినెంట్ గవర్నరు పదవికి రాజీనామా చేసిన నజీబ్ జంగ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ప్రధాని మోదీతో సుధీర్ఘంగా చర్చించానని ముస్లిములతో సంబంధాలపై మోదీ ఎలాంటి వివక్ష చూపించలేదని నజీబ్ వివరించారు. 20 శాతం మంది ముస్లిములున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నజీబ్ జంగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ట్రిపుల్ తలాఖ్ విషయంలో ముస్లిమ్ లు ఆలోచించి ఈ విడాకుల పద్ధతికి స్వస్థి పలకాలని నజీబ్ సూచించారు. సివిల్ కోడ్ విషయంలో ముస్లిమ్ నేతలందరూ కూర్చొని చర్చించుకొని నిర్ణయం తీసుకోవాలని నజీబ్ జంగ్ సూచించారు.