News

లోక్‌సభలో టీడీపీ ఎంపీల నిరసన


పార్లమెంటు బయటే కాదు లోపల కూడా టీడీపీ ఎంపీలు నిరసన కొనసాగిస్తున్నారు. తమతమ స్థానాల్లో కూర్చునే ఏపీకి అన్యాయం చేయాలని రాసి ఉన్న ఫ్లకార్డులు పట్టుకుని మౌనంగా నిరసన తెలుపుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలన్న డిమాండ్లను ఈరోజు కూడా ఎంపీలు లోక్‌సభ దృష్టికి తీసుకువచ్చారు.