News

పదో తరగతి బాలికపై సీనియర్ల అత్యాచారం


ఓ జూనియర్ విద్యార్థినిపై సీనియర్ విద్యార్థులు మృగాళ్ల విరుచుకుపడ్డారు. జ్వరంతో బాధపడుతున్న ఆ బాలికకు అండగా ఉండాల్సింది పోయి.. ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన డెహ్రాడూన్‌లోని ఓ బోర్డింగ్ స్కూల్‌లో గత నెలలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. డెహ్రాడూన్‌లోని ఓ బోర్డింగ్ పాఠశాలలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు చదువుకుంటున్నారు. వీరిలో ఒకరు పదో తరగతి చదువుతున్నారు. అయితే పదో తరగతి బాలికకు నెల రోజుల క్రితం జ్వరం వచ్చింది. ఇదే అదునుగా భావించిన సీనియర్ విద్యార్థులు.. ఆ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. బాలిక గర్భవతి అని ఇటీవలే తేలడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఘటనపై బాధితురాలి సోదరి, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పాఠశాలకు చెందిన ఐదుగురు టీచర్లు, నలుగురు సీనియర్లను అదుపులోకి తీసుకున్నారు.