News

దివ్యాంగులకు అండగా ఉంటాం : కేటీఆర్


గత ప్రభుత్వాలు దివ్యాంగులను ఏమాత్రం పట్టించుకోలేదని, కేసీఆర్ మళ్లీ సీఎం అయితే దివ్యాంగులకు రూ.3016 పెన్షన్ ఇస్తామని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. దివ్యాంగులను వివాహం చేసుకుంటే వారికి ఇచ్చే పారితోషకం రూ.లక్షకు పెంచామని చెప్పారు. సిరిసిల్ల పట్టణంలో దివ్యాంగుల ఆత్మీయ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. దివ్యాంగులపై వరాల జల్లు కురిపించారు. దివ్యాంగులు సానుభూతి, జాలి కోరుకోవడం లేదని, వారికి మరింత ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో దివ్యాంగ భవనం నిర్మించి.. తెలంగాణలో మొదటి జిల్లాగా ఆదర్శంగా నిలుద్దామని అన్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి దివ్యాంగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో బదిరులకు స్మార్ట్ ఫోన్‌లు, లిపి పుస్తకాలను అందజేశామన్నారు. తెలంగాణలోని ప్రతి ఇంచు బీడు భూమి సస్యశ్యామలం కావడానికి కేసీఆర్ కాలంతో పోటీ పడుతున్నారని, ఆయన శ్రమకు తగిన ఫలితం అందాలంటే ప్రతీ ఒక్క దివ్యాంగుడు సైనికునిగా పనిచేసి టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని కేటీఆర్ కోరారు.